Tollywood Movies: దీపావళి స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్

Tollywood Movies: దీపావళి స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్

పండుగే అంటేనే నిండైన కళ.. ఆ కళకు సినిమాలు చక్కని ఆనందాన్నిస్తాయి. ఇలా ఓ పక్క థియేటర్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సినిమాలు అలరిస్తుంటే.. మరో పక్క మేకర్స్ తమ కొత్త సినిమాల పోస్టర్స్ ని పంచుకుంటూ దీపావళి విషెస్ చెబుతున్నారు. 

పుష్ప 2:

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ - రష్మిక జంటగా నటిస్తోన్న ‘పుష్ప 2’ (Pushpa 2) నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్ లో అల్లు అర్జున్, రష్మిక రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకుంది. డైరెక్టర్ సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. 

హిట్ 3:

శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్ర సీక్వెల్స్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో హిట్ 3 : ది థర్డ్ కేస్ ని తెరకెక్కిస్తున్నాడు. దీపావళి కానుకగా స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని సీరియస్‌ యాక్షన్‌ అవతార్‌లో కనిపించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మే 1న రిలీజ్ కానుంది. ఇదివరకే టీజర్ విడుదల కాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

RC 16:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi babu sana) దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kappoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్(AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. తాజాగా దీపావళి కానుకగా RC 16 స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2024 మార్చ్ 20 లాంఛనంగా పూజ కార్యక్రమాలతో మొదలయింది.

రాబిన్ హుడ్:

బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నితిన్ (Nithiin). ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో వెంకీ కుడుముల (Venkykudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్ హుడ్ (Robinhood) ఒకటి. తాజాగా దీపావళి కానుకగా కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ విషెష్ తెలిపారు.