- రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి
- ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ
గచ్చిబౌలి, వెలుగు : దీపావళి పండుగ సందర్భంగా సైబరాబాద్పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రద్దీ ప్రాంతాలు, రోడ్లపై పటాకులు కాల్చడంపై నిషేధం విధిస్తూ సైబరాబాద్ సీపీ అనినాష్మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం కమిషనరేట్పరిధిలో గురువారం రాత్రి 8 గంటల నుంచి10 గంటల వరకు మాత్రమే క్రాకర్స్కాల్చాలని స్పష్టం చేశారు. నవంబర్ రెండు వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు. దీపావళి పండుగను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఇవే ఆంక్షలు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ అమలులో ఉంటాయి.
సనత్‌నగర్‌లో క్రాకర్స్ స్టాల్స్ తనిఖీ
పంజాగుట్ట: సనత్నగర్పోలీస్స్టేషన్పరిధిలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ స్టాల్స్‌ను బాలానగర్ డివిజన్ ఏసీపీ హన్మంతరావు బుధవారం రాత్రి సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో కలిసి తనిఖీ చేశారు. అనుమతులు ఉన్నాయో.. లేదో చెక్‌చేశారు. కేపీహెచ్‌బీ, కూకట్పల్లి ప్రాంతాల్లో పర్మిషన్తీసుకోకుండా క్రాకర్స్ స్టాల్స్ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.