దీపావళి వేడుకల్లో అపశృతి.. సరోజినీ దేవి ఆస్పత్రిలో 50 మంది అడ్మిట్

దీపావళి వేడుకల్లో అపశృతి.. సరోజినీ దేవి ఆస్పత్రిలో 50 మంది అడ్మిట్

దీపావళి సందర్భంగా పలు చోట్ల అపశృతి చోటు చేసుకుంది. టపాసులు కాలుస్తుండగా పలువురి  కంటికి గాయాలయ్యాయి. దీంతో బాధితులు  హైదరాబాద్ లోని  సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. 

అక్టోబర్  31 రాత్రి నుంచి నవంబర్ 1 ఉదయం వరకు  దాదాపు 45 మంది ఆస్పత్రిలో చేరారు. 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.   క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.