
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగనున్నాయి. వైట్ హౌస్ దీపావళి దీపావళి వేడుకలకు అందంగా ముస్తాబైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేసేందుకు రడీ అయ్యారు.
అమెరికా శ్వేతసౌధం దీపావళి పండగ శోభ సంతరించుకుంది. అంగరంగ వైభవంగా అమెరికాలో దీపాల పండుగను జరుపుకొనేందుకు ఇండో అమురికన్లు సిద్దమయ్యారు. ఇక ఈసారి దీపావళి పండగ నవంబర్ 10 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీవరకు అమెరికాలో ఘనంగా జరుగనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండగ శోభ సంతరించుకుంది. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పేరుతో జరుపుకునే ఈ దీపావళి పండగ కోసం ఇళ్లు, ఆలయాలు ఎంతో అందంగా ముస్తాబు చేశారు. అయితే ఈ దీపాల పండుగను అమెరికాలో కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అక్కడ జరిగే అతి పెద్ద పండుగలైన హాలోవిన్, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ లాంటి పండుగల తర్వాత ఆ స్థాయిలో ఈ దీపావళి పండుగను అమెరికాలో నిర్వహించేందుకు అక్కడున్న భారతీయులు సిద్దమయ్యారు. ఈ పండగల రోజు అమెరికాలో సెలవు కూడా ప్రకటిస్తూ ఉంటారు. దీపావళి పండుగ సందర్భంగా కూడా అమెరికాలో సెలవు ప్రకటించారు. ఇక ఈసారి దీపావళి పండగ నవంబర్ 10 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా జరగనుంది.
అమెరికాలో దీపావళి పండగను అంత భారీగా జరుపుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. దీంతోపాటు దీపావళి అంటేనే దీపాలు, పూజలు, బాణసంచా, గిఫ్ట్‌లు ఉంటాయి. దీంతో ఈ పండగ కమర్షియల్‌గా కూడా చాలా బిజినెస్ చేస్తుంది. ఈ రెండు కారణాల వల్లే అమెరికాలో దీపావళి ఘనంగా చేస్తారు. ఇక గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక విషయాన్ని వెల్లడించారు. 2023 దీపావళి పండుగను అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్‌లో తన కుటుంబంతో కలిసి నిర్వహించుకోనున్నట్లు ప్రకటించారు.
ఇక దీపావళి పండగ సందర్భంగా ఆ రోజు ( నవంబర్ 12) సెలవు ప్రకటిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ఏడాది జూన్‌లో ప్రకటించారు. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పెన్సిల్వేనియా కూడా.. దీపావళి సందర్భంగా అధికారిక సెలవును ప్రకటించే బిల్లుకు ఆమోదం కల్పించింది. ఇక పలువురు చట్టసభ సభ్యులు కూడా దీపావళిని అమెరికాలో జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ( జులై 4)న ప్రతిపాదించారు. మరోవైపు.. భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా దీపావళి పండగ ఉత్సవాలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న చీకట్లు, సమస్యల నుంచి బయటపడేందుకు ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని కమలా హారిస్ పేర్కొన్నారు.
సాధారణంగా అమెరికాలో నాలుగు పండగలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. అందులో హాలోవీన్, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, క్వాంజా. అయితే ఈ ఏడాది నుంచి ఈ ప్రధాన పండుగల జాబితాలోకి దీపావళి కూడా చేరిపోయింది. ఇక ఈసారి దీపావళి పండగ నవంబర్ 10 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీవరకు నిర్వహించనున్నారు. ఇక ప్రధానంగా దీపావళిని నవంబర్ 12 వ తేదీన జరుపుకోనున్నారు. ఇక ఈ 5 రోజుల దీపావళి పండగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధులు నిర్వహించుకోనున్నారు.