దీపావళి ఫెస్టివల్.. పాతబస్తీ భాగ్యలక్ష్మీ టెంపుల్కు పోటెత్తిన జనం

దీపావళి ఫెస్టివల్.. పాతబస్తీ భాగ్యలక్ష్మీ టెంపుల్కు పోటెత్తిన జనం

హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ టెంపుల్ దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం సందడిగామారింది. అమ్మవారి దర్శణానికి వచ్చిన భక్తులకు ఖజానా కాయిన్స్ పంపిణీ  చేస్తు్న్నారు నిర్వాహకలు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

మరో వైపు భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. భక్తుల రద్దీని అంచనా వేసిన నిర్వాహకులు మూడు క్యూ లైన్లను ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేశారు.  ప్రతియేటా మాదిరిగానే ఈ యేడు కూడా అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఈసారి అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారునిర్వాహకులు. 

భక్తుల రద్దీలో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతమైన సౌత్ జోన్ ప్రాంతంలో గట్టి భద్రత , నిఘా ఉంచారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తెలెత్తకుండా పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.