దీపావళి అంటే ఒక బాణాసంచా కాల్చడమే కాదు.. దీపాలను వెలిగించడం ముఖ్యమైనదని పండితులు చెబుతారు. పదమూడు దీపాలను వెలిగించడం శ్రేష్టమని అంటారు. పదమూడు దీపాలను వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయని అంటారు. ఈ 13 దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . .
Diwali Special 2023: హిందూ పురాణాల్లోనూ పదమూడు దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. దీపావళి అంటేనే దీపాల వరస అని అర్థం. ఆరోజు దీపాలన్నీ వరసగా పేర్చడాన్ని శుభంగా భావిస్తారు. దీపావళి రోజునే దీపాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ దీపాలు ప్రతికూల శక్తుల నుంచి కాపాడతాయన్నది నమ్మిక. అందుకే పదమూడు దీపాలను వెలిగించాలని పురాణాలు చెప్పడమే కాకుండా పండితులు కూడా అంటారు. అయితే ఈ 13 దీపాలను ఎక్కడపడితే అక్కడ వెలిగించకూడదట. దీపావళి రోజు ఇంటి ఆవరణలో 13 దీపాలను ఎక్కడ వెలిగించాలో తెలుసుకుందాం. . .
- 01. లక్ష్మీదేవిని పూజించే సమయంలో పదమూడు దీపాలను వెలిగించాలి
- 02. ప్రతి ఇంట శుభం కలగాలని కోరుకుంటూ రెండో దీపం వెలిగించాలి
- 03. సంపద, విజయం కోసం మూడో దీపాన్ని వెలిగించాలి.
- 04. తులసి మొక్క ముందు నాలుగు దీపం ఉంచాలి.
- 05. ఇంటి ద్వారం ఎదుట ఐదో ద్వీపం వెలిగించాలి.
- 06. ఆరో దీపాన్ని చెట్టుకింద ఉంచాలంటారు
- 07. ఏడో దీపాన్ని దేవాలయంలో వెలిగించాలి
- 08. చెత్త దగ్గర కూడా ఎనిమిదో దీపాన్ని వెలిగించాలి.
- 09. ఇంటి బాత్‌రూమ్ వెలుపల తొమ్మిదో దీపాన్ని ఉంచాలి
- 10. పదో దీపాన్ని ఇంటి పైకప్పు మీద ఉంచాలి
- 11. కిటికీలో పదకొండో దీపాన్ని వెలిగించాలంటారు
- 12. ఇంటి పై అంతస్థులో ఉంచాలని చెబుతారు
- 13. ఇంటి మధ్యలో మరో దీపం వెలిగించాలి
దీపావళి పండగను దేశమంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హిందువులకు అతి ముఖ్యమైన పండగ. చీకటిని తొలగించి వెలుగులు నింపే పండుగగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. దీపావళి పండుగను ప్రత్యేకంగా చెప్పిన సంప్రదాయాలను పాటిస్తూ దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు.
దీపాలు పాజిటివ్ వైబ్స్ ఇస్తాయని అందరూ భావిస్తారు. ఒక దీపం ఎంతటి వెలుగునిస్తుందో.. అదే మనిషి జీవితంలోనూ వెలుగుగా మారుతుందని విశ్వసిస్తారు. ఆ నమ్మికతోనే దీపాలను వెలిగించి మరీ ఈ పండుగ వేళ అందరూ ఆనందంగా ఉంటూ బాణాసంచాలు కాలుస్తారు. దీపాలను వెలగించడమంటే... దీపావళి అంటే ఒక బాణాసంచా కాల్చడమే కాదు.. దీపాలను వెలిగించడం ముఖ్యమైనదని పండితులు చెబుతారు. పదమూడు దీపాలను వెలిగించడం శ్రేష్టమని అంటారు. పదమూడు దీపాలను వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయని అంటారు.
అయితే దీపాలు వెలిగించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పండితులు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా పండితులు సూచిస్తున్నారు.