లక్ష్మీదేవికి.. వినాయకుడికి సంబంధమేమిటి.. దీపావళి రోజున గణేషుడిని ఎందుకు పూజించాలో తెలుసా..

లక్ష్మీదేవికి.. వినాయకుడికి సంబంధమేమిటి.. దీపావళి రోజున గణేషుడిని ఎందుకు పూజించాలో తెలుసా..

దీపావళి రోజున సాధారణంగా లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు.  ఏదైనా పూజ చేసేటప్పుడు గణేషుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయని పండితులు చెబుతుంటారు.  దీపావళి పండుగ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించే ముందు గణేషుడిని కూడా విశేషంగా పూజించాలని చెబుతున్నారు.   లక్ష్మీ గణపతి లు ఒకే కుటుంబానికి చెందినవారని పురాణాలు చెబుతున్నాయి.  దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి.. ఆధ్యాత్మిక వేత్తలు ఏమంటున్నారు.. వినాయకుడి పూజకు.. లక్ష్మీదేవి పూజకు సంబంధమేమిటి? ముందుగా వినాయకుడి పూజ చేసిన అనంతరం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం ...

పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదకు, ఐశ్వర్యాలకు చిహ్నంగా చిహ్నంగా భావిస్తారు. అందుకు లక్ష్మీదేవి ఎంతో గర్వ పడుతుంది.అయితే లక్ష్మీదేవి గర్వాన్ని అణచాలని భావించిన విష్ణుదేవుడు ఆమె గర్వం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఒక స్త్రీ తాను స్త్రీగా పరిపూర్ణం కావాలంటే ఆమె తల్లి కావాలని విష్ణుమూర్తి చెప్పడంతో ఆ మాటలకు లక్ష్మీదేవి ఎంతో నిరాశ చెందుతుంది.ఈ క్రమంలోనే ఈ బాధలో లక్ష్మీదేవి పార్వతీ దేవి వద్దకు వెళ్లి తనకు ఒక పుత్రుడిని దత్తతగా ఇవ్వాలని అడుగుతుంది.

ఇక లక్ష్మీదేవికి స్థిరత్వం లేదని,ఆమె ఒక చోట ఎప్పుడూ ఉండదని గ్రహించిన పార్వతీదేవి తనకు కొడుకుగా వినాయకుడిని దత్తత ఇస్తుంది. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోష పడి ఎవరైతే సంపద శ్రేయస్సు కావాలని భావిస్తారో వారు ముందుగా వినాయకుడికి పూజ చేయాలి.వినాయకుడి పూజ అనంతరం తనకు పూజ చేసినప్పుడే ఫలితం దక్కుతుందని చెప్పడం వల్ల దీపావళి పండుగ రోజు ముందుగా వినాయకుడికి పూజ చేసి అనంతరం లక్ష్మీదేవికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి రోజున లక్ష్మీదేవి.. వినాయకుడిని పూజిస్తే అమ్మ ఆశీస్సులతో పాటు సంపదకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు 

అందుకే దీపావళి పండుగ రోజు కేవలం లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా వినాయకుని కూడా పూజిస్తారు . పురాణాల ప్రకారం సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని భావిస్తారు.ఈ క్రమంలోనే ఆశ్వయుజ  అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టిన దినంగా భావించి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఎంతో వేడుకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ రోజు ఇల్లు మొత్తం దీపాలతో ఎంతో అందంగా అలంకరించి ఈ పండుగను జరుపుకుంటారు.

సనాతన సంప్రదాయంలో  ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున సుఖ సంపదలను ఇచ్చే గణేశుడిని , సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి రోజు రాత్రి ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చి తన పూర్ణ ఆశీస్సులు కురిపించాలని అందరి కోరిక. దీపావళి రోజు రాత్రి సంపద దేవత లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద ఉంటుందని నమ్మకం.

దీపావళి రోజున పూజ విధానం:

  • దీపావళి రోజు రాత్రి ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చి తన పూర్ణ ఆశీస్సులు కురిపించాలని అందరి కోరిక. దీపావళి రోజు రాత్రి సంపద దేవత లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద ఉంటుందని నమ్మకం. 
     
  • దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడానికి ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోండి. ఎందుకంటే పరిశుభ్రత ఉన్న చోట సంపద చిహ్నం అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.
     
  • లక్ష్మి దేవి ఆశీర్వాదం పొందడానికి.. గణపతిని ఎందుకు పూజించాలంటే.. వినాయకుడి నుండి ఆశీర్వాదం లేకుండా ఏ పని పూజ ఫలితాన్ని ఇవ్వదు. కనుక లక్ష్మీదేవి పూజకు ముందు గణేష్ ను పూజిస్తారు. మనిషి సంపద, శ్రేయస్సు కోసం డబ్బు ముఖ్యమని నమ్మకం. ఆర్ధికంగా బలంగా ఉన్నప్పుడే.. ఇల్లు, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.
     
  • లక్ష్మీ దేవిని పూజించడానికి.. ఈశాన్య దిశను ఎంచుకోవాలి. పూజించే స్థలాన్నీ శుభ్రం చేసి.. గంగా జలంతో శుద్ధిచేయాలి.
     
  • లక్ష్మీ గణపతిని  పూజించాలనుకునే ప్రదేశంలో.. ముందుగా ఒక పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరచి, దానిపై నవగ్రహాలను ఆవాహన చేసి .... అనంతరం లక్ష్మీగణపతులను స్థాపించండి.
     
  • ఈశాన్య మూలలో సంపద దేవత లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయండి. అయితే పూజ చేసేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంచండి.
     
  • దీపావళి రాత్రి గణేష్,,, -లక్ష్మితో పాటు శ్రీ హరి విష్ణువును పూజించాలి. శ్రీ మహావిష్ణువు ఎక్కడ పూజింపబడతాడో అక్కడ సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని కొలువుంటుందని విశ్వాసం.
     
  • ఎంతో కష్టపడి, శ్రమించినా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే.. దీపావళి రోజు రాత్రి, సంపదల దేవత అనుగ్రహాన్ని కురిపించే శ్రీ యంత్రాన్ని పూజించడం మరువకండి. శ్రీ యంత్రాన్ని పూజించే ఇంట్లో, లక్ష్మీ దేవి నివాసం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు.
     
  • దీపావళి రోజున ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీ దేవి పూజలో ఆమెకు ఇష్టమైన ఆవుపాలు, కొబ్బరికాయ, గోమతి చక్రం, నాగకేసర, తామరపువ్వు మొదలైన వాటిని తప్పనిసరిగా సమర్పించాలి. లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే.. సంపద  దేవత  అనుగ్రహం సదా ఆ కుటుంబం పై ఉంటుందని.. విశ్వాసం.

ALSO READ :- బైంసా కేసీఆర్ సభలో మహిళల నిరసనలు..