
పొద్దున్నే లేవడం బెడ్ కాఫీ.. లేదా టీ తాగుతుంటారు.. ఇంకా నిద్రమత్తు కూడావదలదు. అయినా సరే దృష్టి వాటివైపే వెళుతుంది. ఒక్కోసారి అనుకోకుండి బెడ్ పై కాఫీ టీ మరకలు పడతాయి. ఎన్ని సోపులు పెట్టినా.. ఎన్ని వినూత్న పద్దతులు పాటించి ఆ మరకలు పోవు. అంతే కాకుండా బెడ్ షీట్‌పై ఒక్కోసారి అనుకోకుండా.. పళ్ల రసాలు.. ఇంకా అనేక వస్తువులు మరకలు ఏర్పడుతాయి.
ఇవి వదలకుండా మొండి ఘటాల్లాగా పట్టుకుంటాయి. వీటిని క్లీన్ చేయాలంటే ఇల్లాలికి ఎంతో కష్టంగా మారుతుంది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసిన పోవు. అయితే వంటింటి చిట్కాలను ఉపయోగించి తయారు చేసిన క్లీనర్ తో ఇట్టే పోతాయంటున్నారు. ఆ క్లీనర్ తయారీ ఏఏ ఐటమ్స్ కావాలి.. ఎలా తయారు చేయాలి..ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం..
ఇంట్లో తయారుచేసిన క్లీనర్‌తో పరుపుపై పడిన మరకలను.. బాగా మాసి పోయి ఉంటే అలాంటి వాటిని ఇంట్లో తయారు చేసిన క్లీనర్ తో క్లీన్ చేసుకోవచ్చు.
క్లీనర్ తయారీకి కావలసిన మెటీరియల్
- బేకింగ్ సోడా - 1 టేబుల్ స్పూన్
- నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
- తెల్ల వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
- డిష్ సబ్బు - 1 టీస్పూన్
- టూత్‌పేస్ట్
క్లీనర్ తయారీ విధానం: ఒక గిన్నెలో నిమ్మరసం, బేకింగ్ సోడా వైట్ వెనిగర్ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. తరువాత 1 టీస్పూన్ డిష్ సోప్ ను వేసి స్పూన్ తో బాగా కలపాలి. పేస్ట్ మాదిరిగా వచ్చేవరకు కలపాలి. అంతే క్లీనర్ రడీ . దీనిని ఉపయోగించి మరకలను తొలగించవచ్చు
►ALSO READ | ఇలా కూడా ఉంటారేంట్రా : భోజనాల దగ్గర వివాదం.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి ఫ్యామిలీ
క్లీనర్ ఉపయోగించే విధానం: ఈ క్లీనర్ పేస్ట్‌ను మరకలు ఉన్న చోట అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉంచండి. ఆ తరువాత తడి గుడ్డను తీసుకొని బాగా రుద్దండి. మరకలు పోతాయి. ఇంకా మరకలు అలాగే ఉంటే.. దానిపై టూత్ పేస్ట్ ను బ్రష్ ను ఉపయోగించి తేలికగా రుద్దండి. ఎలాంటి మొండి మరకలైనా పోతాయి. అయినా ఇంకా కనపడుతుంటే రెండు రోజులాగి మరోసారి ఇలా చేయండి.