రివ్యూ: డిజె టిల్లు

రివ్యూ: డిజె టిల్లు

రివ్యూ: డిజె టిల్లు
రన్ టైమ్: 1 గంట 55 నిమిషాలు
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, కిరీటి, నర్రా శీను తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, తమన్
రచన: విమల్ కృష్ణ, సిద్దూ జొన్నలగడ్డ
నిర్మాత: నాగవంశీ
దర్శకత్వం: విమల్ కృష్ణ
రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 12,2022

 కథేంటి?
టిల్లు (సిద్దూ) పక్కా హైదరాబాదీ. డి.జె అంటే ఇష్టం. అదే ప్రొఫెషన్ గా ఎంచుకుంటాడు. బోనాలు, సారి ఫంక్షన్ లకు డి.జె వాయిస్తాడు. అతడు ఓసారి పబ్ లో సింగర్ రాధిక (నేహా శెట్టి)ని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా టెంప్ట్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ కు ఇంకో అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలుసుకొని టిల్లుతో కంటిన్యూ అవ్వాలనుకుంటుంది. అదే విషయమై బాయ్ ఫ్రెండ్ తో గొడవపడుతుంది. ఆ గొడవలో బాయ్ ఫ్రెండ్ చనిపోతాడు. అది కవర్ చేయడానికి టిల్లు హెల్ప్ తీసుకుంటుంది. ఆ అమ్మాయికి ఇంకా ఇలాంటి ఎఫైర్లు చాలా ఉన్నాయని తెలుసుకుంటాడు టిల్లు. ఆ డెడ్ బాడీని దాచే క్రమంలో చాలా సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఆ సమస్య నుండి తను ఎలా బయటపడ్డాడు అనేది కథ,
 

నటీనటుల పర్ఫార్మెన్స్:
సిద్దూ జొన్నలగడ్డ అంతా తానై నటించాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.తను మాట్లాడిన తెలంగాణ స్లాంగ్,డిజె పాత్ర అన్ని బాగా చేశాడు. నేహా శెట్టి బోల్డ్ రోల్ ప్లే చేసింది.గ్లామర్,నటన తో ఆకట్టుకుంది. తన పాత్రకు తగిన న్యాయం చేసింది.ప్రిన్స్ బాగా చేశాడు.బ్రహ్మాజీ,ఫిష్ వెంకట్,కిరీటీలు తమ పరిధిమేర నటించారు.
 

టెక్నికల్ వర్క్:
సాయి ప్రకాష్ సినిమటోగ్రఫీ బాగుంది. శ్రీ చరణ్ పాకల ఇచ్చిన పాటల్లో టైటిల్ సాంగ్ చాలా బాగుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కు హెల్ప్ అయింది. ఎడిటింగ్ బాగుంది. సిద్దూ జొన్నల గడ్డ రాసుకున్న కామెడీ డైలాగులు బాగా పేలాయి.
విశ్లేషణ:
డిజె టిల్లు టైమ్ పాస్ ఎంటర్ టైనర్.లాజిక్ లు వదిలేసి టైమ్ పాస్  కోసం చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. మాస్ యూత్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. సిద్దూ జొన్నల గడ్డ పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్. ఫస్టాఫ్ హిలేరియస్ గా ఉంది.రొమాన్స్, కామెడీ  అన్నీ బాగా సెట్ అయ్యాయి.కానీ సెకండాఫ్ వచ్చేసరికి లాగ్ ఎక్కవైంది. తర్వాత లాజిక్ లెస్ గా ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో సరిగా జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తీసేసారు.సెకండాఫ్ లో ఓ 30 నిమిషాలు బోరింగ్ గా సాగుతుంది. కోర్ట్ రూమ్ డ్రామాను ఇటీవల జాతి రత్నాలు లో లాగా కామెడీ చేయాలని చూసారు. అది అంత వర్కవుట్ అవ్వలేదు. క్లైమాక్స్ ఫర్వాలేదు. దానివల్ల ఓవరాల్ గా పాస్ పోయింది. కొత్త సినిమాలు కోరుకునే వారికి పెద్దగా నచ్చదు కానీ..టైమ్ పాస్ ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికి నచ్చుతుంది.
 

బాటమ్ లైన్: డిజె టిల్లు- ఎంటర్ టైన్మెంట్ ఫుల్లు