US Open 2024: టార్గెట్ 25

  • 25వ గ్రాండ్‌‌స్లామ్‌‌పై జొకోవిచ్‌‌ గురి
  • నేటి నుంచి యూఎస్‌‌ ఓపెన్

న్యూయార్క్‌‌: ఎట్టకేలకు ఒలింపిక్ గోల్డ్ మెడల్‌‌ నెగ్గి గోల్డెన్ స్లామ్ పూర్తి చేసుకున్న  సెర్బియా టెన్నిస్ లెజెండ్ నొవాక్ జొకోవిచ్‌‌ ఇప్పుడు 25వ గ్రాండ్‌‌స్లామ్‌‌పై గురి పెట్టాడు. సోమవారం మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌‌స్లామ్ యూఎస్‌‌ ఓపెన్‌‌లో 37 ఏండ్ల జొకో  డిఫెండింగ్ చాంపియన్‌‌గా, ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్‌‌లో అతను 138వ ర్యాంకర్ రబు ఆల్బట్‌‌ (మాల్డోవా)తో పోరు ఆరంభించనున్నాడు. 

రెండో సీడ్‌‌ నొవాక్‌‌ యూఎస్ ఓపెన్‌‌లో ఇప్పటికే నాలుగు సార్లు విజేతగా నిలిచాడు. ఈసారి అతనికి స్పెయిన్ యంగ్‌‌స్టర్ కార్లోస్ అల్కరాజ్‌‌, జర్మనీ స్టార్, డోపింగ్‌‌ బ్యాన్‌‌ నుంచి తప్పించుకున్న వరల్డ్ నంబర్ వన్‌‌ జానిక్ సినర్‌‌‌‌ నుంచి సవాల్ ఎదురవనుంది. ఇండియా నుంచి సుమిత్ నగాల్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తొలి రౌండ్‌‌లో అతను నెదర్లాండ్స్ ఆటగాడు టాలాన్‌‌తో పోటీ పడనున్నాడు. ఇక, విమెన్స్‌‌లో డిఫెండింగ్ చాంపియన్ కొకో గాఫ్‌‌ టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సబలెంక,  స్వైటెక్‌‌ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నారు.