జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డెన్ స్లామ్‌‌‌‌.. ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విక్టరీ

జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డెన్ స్లామ్‌‌‌‌.. ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విక్టరీ

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సెర్బియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెజెండ్ నొవాక్ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 37 ఏండ్ల వయసులో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.  మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త కెరటం కార్లోస్ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెక్ పెట్టాడు. దాంతో అన్ని గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ టైటిళ్లు, ఒలింపిక్ గోల్డ్‌‌‌‌తో గోల్డెన్‌‌‌‌ స్లామ్ పూర్తి చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7-–6 (7/3), 7–-6 (7/2)తో స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ కార్లోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి తొలిసారి ఒలింపిక్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 

మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన నొవాక్ 2008 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్యం అందుకున్నాడు. ఇన్నేండ్ల పోరాటం తర్వాత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి తన  కలను నెరవేర్చుకున్నాడు. గాయం కారణంగా ఇదే మట్టి కోర్టులో గత ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలోనే వైదొలిగిన జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వింబుల్డన్ ఫైనల్లో కార్లోస్ చేతిలో ఓడిపోయాడు. మోకాలి గాయంతోనే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగిన జొకో.. నెల తిరగకుండానే వింబుల్డన్ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటమికి అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్ పోటీల సింగిల్స్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ పతకం గెలిచిన పెద్ద వయస్కుడిగా 37 ఏండ్ల  నొవాక్ రికార్డు సృష్టించాడు.