తెలంగాణ దశాబ్ది వేడుకల్లో డీజేల మోత.. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు అంతరాయం 

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామ్ జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దేవరకొండ నియోజకవర్గానికి మాత్రం వర్తించదా..? ప్రజలకు ఒక సెక్షన్.. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఒక సెక్షన్ అమలవుతుందా..? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 

అసలేం జరిగింది..? 

దేవరకొండ ప్రభుత్వ బాలుర కళాశాలలో శనివారం (జూన్ 17న)  ఉదయం 9:30 నుండి 12:30 వరకు సప్లమెంటరీ పరీక్ష ఉంది.అయితే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా దేవరకొండ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు  డీజేలు, సౌండ్ బాక్స్ లు పెట్టారు. భారీ శబ్దలు చేస్తూ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు ఇబ్బందిని క్రియేట్ చేశారు. పోలీసుల సమక్షంలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు పరీక్షలకు ఇబ్బంది కల్గించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఎవరూ పట్టించుకోలేదు.