
ఆదిలాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతులు లేవని డీఏస్పీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో డీజే ఓనర్స్ తో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
డీజే ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొని డీజేలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.