నల్గొండ అర్బన్, వెలుగు : విద్యావంతులందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. బుధవారం నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిది మాటలగారడి ప్రభుత్వమని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
నిరుద్యోగ భృతి రూ.4 వేలు, 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన పోరాడే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, ఎంపీ అభ్యర్ధి శానంపుడి సైదిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాసగౌడ్, గోలి మధుసూదన్‌రెడ్డి, శ్రీదేవిరెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లిరామరాజు, సాధినేని శ్రీనివాస్, కల్యాణ్‌నాయక్, లింగయ్య, మహేశ్తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి
సూర్యాపేట, వెలుగు : ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు కోరారు. బుధవారం సూర్యాపేటలోని సంకినేని నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.