
ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ TRSలో పూర్తిగా కలిసిపోతోందని.. అందుకు కాంగ్రెస్ ముఖ్య నేతల వ్యవహారశైలే కారణమని ఆరోపించారు డీకే అరుణ. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో BJP రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె.. TRSతో లాలూచీ పడి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో TRSకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి BJPకే అవకాశం ఉందన్నారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించే శక్తి మోడీ నాయకత్వంలోని BJPకే ఉందని భావించి.. తాను BJPలో చేరినట్టు తెలిపారు. తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో BJP ను గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు అరుణ.