పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుంటే కాంగ్రెస్ మళ్లీ కుట్ర రాజకీయలు చేస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ తప్పుడు ప్రచారంతో మళ్ళీ గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. మళ్లీ మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతుండని.. దీన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి విజయ సంకల్పయాత్ర రోడ్డు షోలో డీకే అరుణ ప్రసంగించారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని.. ఇండియా కూటమి రాహుల్ ప్రధాని అంటే ఒప్పుకోవటం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు డీకే అరుణ. రాహుల్ ప్రధాని కాలేడు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు, కాబట్టి ఆ హామీలు నెరవేరవని తెలిపారు.
ALSO READ :- బిగ్ బ్రేకింగ్ : గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్
రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినా.. మోదీ తెలంగాణపై చిన్న చూపు చూస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మహిళలు, రైతులు, యువత, పల్లెలు అభివృద్ధి చెందాలంటే.. మోదీయే మళ్లీ ప్రధాని కావాలన్నారు. తెలంగాణలో వేల కోట్లతో అభివృద్ధి జరిగిందని... ఇలా అభివృద్ధి చెందాలంటే నిజామాబాద్ లో అరవింద్ గెలిపంచాలని డీకే అరుణ కోరారు.