మా జోలికొస్తే సహించం..ప్రతిఘటిస్తాం

మా జోలికొస్తే సహించం..ప్రతిఘటిస్తాం
బీజేపీ కార్యకర్తలు, నాయకుల జోలికివస్తే…సహించేది లేదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ. బోగస్ కేసులు పెడతామంటే ప్రతిఘటనలు తప్పవన్నారు.  రైతు వేదికల నిర్మాణాలపై కేసీఆర్ ఫోటోలతో పాటుగా  ప్రధాని మోడీ ఫోటో కూడా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అవసరం లేదన్న కేసీఆర్…మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నారని…మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మేల్కొనాలని సూచించారు. నారాయణపేట మండలం ధన్వాడలో బీజేపీ నాయకులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేట పట్టణంలో నిర్వహించిన పార్టీ నేతల భేటీలో అరుణ పాల్గొన్నారు. బీజేపీ గెలుపు కోసం అందరు ఎదరుచూస్తున్నారు