మహబూబ్​నగర్ జిల్లాలో బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్రమంత్రికి వినతి

మహబూబ్​నగర్  జిల్లాలో బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్రమంత్రికి వినతి

మహబూబ్​నగర్​, వెలుగు:  మహబూబ్​నగర్  జిల్లా కేంద్రంలో నూతన బైపాస్ రోడ్ ను నిర్మించాలని  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరినీ పాలమూరు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలోని కేంద్రమంత్రిని ఆయన ఆఫీసులో కలిశారు. అనంతరం బైపాస్​ రోడ్డును నిర్మించాలని వినతిపత్రం అందజేశారు.  గతంలో మున్సిపాల్టీగా ఉన్న మహబూబ్​నగర్ ఇప్పుడు కార్పొరేషన్ గా మారిందన్నారు.  

కొత్తగా  విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ఏర్పాటు అవుతున్నాయని, పట్టణానికి కేవలం ప్రధాన రహదారి ఒక్కటే ఉండడం, పెద్ద  వాహనాలు పట్టణంలో నుంచే  వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.