మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెద్ద మోసం, దగా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను పాలమూరు ప్రజలు, రైతులు గుర్తించాలని కోరారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని పార్టీ జిల్లా ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటా కంటే తక్కువగా చూపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టుల పేరిట రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ పేరును పలికే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.