![మంత్రి హత్య కుట్ర డ్రామాకు మూలం కేసీఆరే](https://static.v6velugu.com/uploads/2022/03/DK-Aruna-said-that-KCR-was-the-first-accused-in-the-conspiracy-to-assassinate-Minister-Srinivas-Goud_KrC1lSXMYG.jpg)
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసు ఓ కుట్ర అని..కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. మంత్రి హత్య కుట్ర కేసు డ్రామాకు సీఎం కేసీఆరే మూలం అని అన్నారు. మొదటి ముద్దాయిగా కేసీఆర్ ను..రెండవ ముద్దాయిగా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ను చేర్చాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. మంత్రి హత్యకు కుట్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. నిందితుల ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎఫ్ఐఆర్ లో అన్ని కట్టుకథలే పెట్టారన్నారు. నిందితులను అరెస్ట్ చేశారా? కిడ్నాప్ చేశారా అనేది వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పాలన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారంతా.. ఒకప్పుడు మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుచరులేనన్నారు డీకే అరుణ.