పాలమూరు, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు మోదీ గ్యారెంటీ ఇచ్చారని పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాళికాంబ కన్వెన్షన్ హాల్లో పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ మోర్చా సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. గత 60 ఏండ్ల కాంగ్రెస్ హయాంలో చేయని పనులను మోదీ ప్రభుత్వం చేసి చూపిందని చెప్పారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని 4 లక్షల మందికి కేంద్ర పథకాలు అందాయన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, ఉపాధ్యక్షుడు క్రాంతి కిరణ్ , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్, ఎస్సీ పార్లమెంట్ ఇన్చార్జి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాపకల్ల కొండయ్య, ఎడ్ల కృష్ణయ్య సాయిరాం, శ్రీరాములు వివిధ మండలాల ఎస్సీ మోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు.