గద్వాల, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అంటే బీఆర్ఎస్ కు వణుకు మొదలైందని, నిరుద్యోగ మార్చ్‌తో కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. శనివారం బంగ్లాలో మహబూబ్ నగర్ లో ఈనెల 25న నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ వైఫల్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిందని, దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగు పడిందని, తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. నిరుద్యోగ మార్చ్‌కు నిరుద్యోగులు భారీగా తరలివచ్చి సక్సెస్ చేయాలని కోరారు. పార్టీ ఇన్ చార్జి వెంకటరెడ్డి, వీరేంద్ర గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, గద్వాల నియోజకవర్గ కన్వీనర్ రామాంజనేయులు, బండల వెంకట్రాములు, నాగేందర్ యాదవ్, రజక జయశ్రీ పాల్గొన్నారు.
నారాయణపేట: బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 25న పాలమూరులో నిర్వహించే నిరుద్యోగ మార్చ్ తో ప్రభుత్వం దిగి రావాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగ్ పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాసులు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ మార్చ్ వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. లీకేజీలో మంత్రులు, అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేయాలని కోరారు. జీకే నర్సింహులు, విజయకుమార్, ఆశప్ప, రఘురామయ్య గౌడ్, కృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.
కోస్గి టౌన్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న పాలమూరులో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేయాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, కోకన్వీనర్ నర్సిములు, కోట కొండరాములు కోరారు. శనివారం కోస్గిలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. కూర వెంకటయ్య, మదన్, చంద్రప్ప, బాబయ్యనాయుడు
పాల్గొన్నారు.
జడ్చర్ల టౌన్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి విమర్శించారు. జడ్చర్లలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీని రద్దు చేయకుండా, ఒకరిద్దరి వల్ల చిన్న పొరపాటు జరిగిందని చెప్పడం దారుణమన్నారు. ఈ నెల 25న మహబూబ్‌నగర్‌లో జరిగే నిరుద్యోగ మార్చ్‌ను సక్సెస్ చేయాలని కోరారు.