డీకే అరుణ కుమార్తె క్రెడిట్​కార్డు చోరీ.. రూ.11 లక్షలను కాజేసిన డ్రైవర్..!

బీజేపీ సీనియర్​నేత.. మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి తెలిసిన వారి చేతుల్లోనే మోసపోయారు. ఆమె వద్ద డ్రైవర్​గా పని చేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డు దొంగిలించి లక్షల రూపాయలు కొట్టేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  శ్రుతి రెడ్డి బంజారాహిల్స్​ లోని రోడ్​నంబర్​ 14 ప్రేమ్​ పర్వత్​ విల్లాస్​లో ఉంటున్నారు. డ్రైవరుగా పని చేస్తున్న బీసన్న ఇంట్లో పెట్టిన హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డును అపహరించాడు. శ్రుతికి తెలిసిన మహావీర్​ జెమ్స్​ అండ్​పెరల్స్​నగల దుకాణానికి వెళ్లి రూ.11 లక్షలు డ్రా చేశాడు. 

Also Read :-గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి షాక్..

గుర్తించిన ఆమె..  డ్రైవర్ ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు.  దీంతో ఆమె డ్రైవర్​పై బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.  కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.