హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ. 700 కోట్లు దోచుకున్న కంపెనీ

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ. 700 కోట్లు దోచుకున్న కంపెనీ

ప్రజల అత్యాశను ఆయుధంగా మలుచుకొని ఓ సంస్థ కోట్లు దోచేసింది. అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వెలుగు చూసింది.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ డీకేజెడ్ (DKZ) టెక్నాలజీస్ అనే సంస్థ ప్రజల పెట్టుబడులు సేకరించింది. ఈ మొత్తం దాదాపు 700 కోట్ల రూపాయలు. చివరకు లాభాలు పక్కనపెడితే అసలకే టోపీ పెట్టింది. నగర వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ ఘటనలో డబ్బులు పోగొట్టుకున్న వందలాది బాధితులు శుక్రవారం(సెప్టెంబర్ 13) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. మీడియాతో తమ బాధను పంచుకున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు. బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.