
- హౌసింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకే
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్ ఇప్పటికే లాంచ్ చేసిన హౌసింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి రూ.20 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే సుమారు రూ.43 వేల కోట్ల క్యాష్ మిగులుతుందని కంపెనీ చెబుతోంది. హౌసింగ్ ప్రాజెక్ట్‌లు, రెంట్‌కు ఇచ్చే కమర్షియల్ ప్రాజెక్ట్‌లను రానున్న కొన్నేళ్లలో పూర్తి చేసే ప్లాన్‌ను షేర్‌హోల్డర్లకు కంపెనీ శనివారం వివరించింది. కాగా, డీఎల్‌ఎఫ్ చాలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను లాంచ్ చేసింది. ఇందులో గురుగ్రామ్‌లో కడుతున్న లగ్జరీ ప్రాజెక్ట్ ‘ది దహ్లియస్’ కూడా ఉంది.
ఈ ప్రాజెక్ట్‌తో రూ.35 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా. కిందటేడాది డిసెంబర్ నాటికి కంపెనీ దగ్గర రూ.9 వేల కోట్ల క్యాష్ బ్యాలెన్స్ ఉంది. హౌసింగ్ యూనిట్లను అమ్మడం ద్వారా కస్టమర్ల నుంచి రూ.30 వేల కోట్లు సేకరించింది. ఇంకా అమ్మకుండా ఉన్న ఇండ్ల నుంచి రూ.24 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా. నిర్మాణ ఖర్చులను తీసేస్తే ఇప్పటికే లాంచ్ చేసిన ప్రాజెక్ట్‌ల ద్వారా రూ.43 వేల కోట్ల క్యాష్ మిగులుతుందని డీఎల్ఎఫ్ అంచనా వేస్తోంది. రెంటల్ బిజినెస్ సెగ్మెంట్‌లో ఆఫీస్, రిటైల్ స్పేస్‌ను డెవలప్ చేయడానికి, కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కట్టడానికి రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది.