జీపీ నిధుల అవకతవకలపై విచారణ

జీపీ నిధుల అవకతవకలపై విచారణ

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామపంచాయతీలో  నిధుల అవకతవకలపై డీఎల్పీవో మల్లికార్జున్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.  ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,  కలిసి  రికార్డలను తనిఖీ చేశారు.  ఇటీవల అధికారులకు అందిన ఫిర్యాదుతో  విచారణ చేపట్టినట్టు తెలిపారు.  

రూ.2 లక్షల 40 వేల  ఎస్టీఓలో జమ చేయలేదని ప్రాథమిక విచారణలో తెలిందని,   రికార్డులను సీజ్ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.