చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట, వెలుగు: ఆటో డ్రైవర్లు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ, జడ్జి పి.శ్రీవాణి సూచించారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పబ్లిక్ పోలీసులుగా ఉండాలని, పని పట్ల శ్రద్ధగా ఉండాలన్నారు. 

లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని చెప్పారు. లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరమని తెలిపారు. మద్యం తాగి ఆటో నడపడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాలను పరిశీలించారు.