న్యూఢిల్లీ: డీ మార్ట్ రిటైల్ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్‌కు ఈ ఏడాది మార్చితో ముగి సిన నాలుగో క్వార్టర్లో రూ. 12,393 కోట్ల ఆదాయం వచ్చింది. వార్షికంగా ఇది 19.89 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇదేకాలంలో రూ.10,337.12 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి 31, 2024 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 365కి చేరుకుంది.
2021-–22 ఆర్థిక సంవత్సరం జనవరి–-మార్చి త్రైమాసికంలో, అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాండ్‌లోన్ ఆదాయం రూ. 8,606.09 కోట్లు ఉంది. రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం ప్రమోట్ చేస్తున్న డీమార్ట్‌కు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలం గాణ, ఛత్తీస్‌గఢ్, ఎన్సీఆర్, తమిళనాడు, పంజాబ్ రాజస్థాన్‌తో సహా పలు రాష్ట్రాల్లో స్టోర్లు ఉన్నాయి.