గాంధీలో రేప్ జరిగినట్లు ఆధారాల్లేవ్

గాంధీ ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తున్నామన్నారు DME రమేష్ రెడ్డి. ఇప్పటికే ఇంటర్నల్ ఫోర్ మెన్ కమిటీ రిపోర్ట్ లో గాంధీ ఆస్పత్రిలో జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మరోవైపు కనిపించకుండా పోయిన మహిళ కోసం గాంధీలో అణువణువు గాలిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్ సెక్యూరిటీ మీద ఎలాంటి అనుమానాలు లేవన్నారు.

తనకు మత్తు మందు ఇచ్చి, గాంధీ హాస్పిటల్ ఉద్యోగి, ఇంకొందరు వారం రోజులు రేప్ చేశారని కుటుంబ సభ్యులకు తెలిపింది ఓ బాధితురాలు. ముందుగా మహబూబ్ నగర్ వన్ టౌన్  పీఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. కానీ సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని అక్కడి పోలీసులు హైదరాబాద్ పంపారు. దీంతో బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాస్పిటల్ ఉద్యోగి ఉమామహేశ్వర్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకొన్నారు. అత్యాచార ఘటనపై వారిని ప్రశ్నిస్తున్నారు.