పెద్దపల్లిలో దారి మళ్లుతున్న డీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ నిధులు

  • సీఎస్​ఆర్​  ఫండ్సూ పక్కదారి 
  •  చట్టాల పేరిట సొంత ఖజానాలో వేసుకున్న బీఆర్ఎస్​ సర్కార్​
  •  స్థానిక సంస్థలకు ఆదాయానికి గండి 
  •  గతంలో ఏటా ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు రూ.1500 కోట్ల ఆదాయం 
  •  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో సీనరేజ్​, స్టాంప్​డ్యూటీ సర్కార్​ఖాతాలోకే.. 

పెద్దపల్లి, వెలుగు:  మైనింగ్​ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన డిస్ట్రిక్ట్​ మినరల్ ఫౌండేషన్​ ట్రస్టు (డీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ), కార్పొరేట్ సోషల్​ రెస్పాన్సబిలిటీ(సీఎస్​ఆర్)  నిధులు డైవర్ట్​ అయ్యాయి. ట్రస్టు బాధ్యతలు ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉండడంతో ఫండ్స్​ యథేచ్ఛగా ఇతర అవసరాల కోసం మళ్లిస్తున్నారు.

కొత్త చట్టాలు చేసి సీనరేజ్​, స్టాంపు డ్యూటీలను స్థానిక సంస్థలకు అందకుండా సర్కార్​తన ఖజానాకు జమచేసుకుంది. స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడడంతో గ్రామాల్లో కనీస పనులు కూడా చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు అభివృద్ధి పనుల కోసం సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే నిధుల కోసం స్థానిక సంస్థలు ఎదురుచూడాల్సిన పరిస్థితి. 

​సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తేనే నిధులు 

కొత్త పంచాయితీరాజ్​ చట్టం జిల్లాల అభివృద్ధికి ఆటంకంగా మారింది. జిల్లాల్లోని స్థానిక సంస్థలకు వివిధ పన్నుల ద్వారా రావాల్సిన నిధులకు భారీగా గండిపడుతోంది. చట్టంలో మార్పుల వల్ల స్థానిక సంస్థలు నిధుల విషయంలో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరాడాల్సి వస్తుంది. దీనిపై ఆయా ఏరియాలకు చెందిన ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  

పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన డీఎంఎఫ్​టీ, సీఎస్ఆర్​ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2019  నుంచి 2023 డిసెంబర్​ వరకు  రూ. 307.25 కోట్లతో 468 పనులకు ప్రతిపాదనలు ఆమోదించారు. ఐదేళ్లలో పూర్తయినవి 95 పనులు కాగా 50 వర్క్స్ జరుగుతున్నాయి.  వీటి కోసం ఇప్పటికే రూ. 60.37 కోట్లు రిలీజ్​ కాగా అందులో 45.15 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన డీఎంఎఫ్​టీ నిధులు నాటి సర్కార్​ ఏ విధంగా వినియోగించిందో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. 

నిధులన్నీ సర్కార్​ ఖాతాలోకే​ 

మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి గతంలో సీనరేజ్, స్థిరాస్తుల అమ్మకాలకు సంబంధించి స్టాంప్​ డ్యూటీలో అధిక భాగం స్థానిక సంస్థల ఖాతాల్లో జమ అయ్యేవి. సీనరేజ్​ పన్నులు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు సంబంధించి దాదాపు రూ. 1500కోట్లకు పైగానే ఉండేది.  ఈ సొమ్ములో జడ్పీలకు 25శాతం, మండల పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 50శాతం, గ్రామాలకు 25శాతం వాటా ఉండేది. అలాగే స్టాంప్​ డ్యూటీని 75 శాతానికి పెంచారు.

ఇందులో జీపీలకు 15 శాతం, మండల పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 10 శాతం, జడ్పీలకు 50 శాతం కేటాయించేవారు. గత సర్కార్​ తీసుకొచ్చిన పంచాయతీరాజ్​ చట్టంలో సీనరేజ్​, రిజిస్ట్రేషన్​ ద్వారా వచ్చే పన్నుల కేటాయింపులో కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. స్టాంపు డ్యూటీ మొత్తం సర్కార్​ ఖాతాకే వెళ్తుంది, సీనరేజ్​ పన్నులకు సంబంధించి దీన్ని డిస్ట్రిక్ట్​ మినరల్​ ఫండ్(డీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ) పేరిట కొత్త విధానం తీసుకొచ్చారు.

అయితే ఇప్పటివరకు డీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్థానిక సంస్థలకు అందించలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలకు ఏటా వచ్చే రూ. 1500 కోట్లు ఇప్పుడు దక్కడం లేదు. 

ఈ ప్రాంతంలో ఖర్చు కావాల్సిన నిధులు వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాకు రావాల్సిన సీనరేజ్​ నిధులు కూడా ఇప్పటి వరకు రాలేదని వాపోతున్నారు.