మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ను మంగళవారం డీఎంహెచ్వో అల్లం అప్పయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది విధుల్లో లేకపోవడంపై డీఎంహెచ్వో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు డాక్టర్లు స్వహ్నిత, వైశాలితోపాటు, కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, హెల్త్ అసిస్టెంట్ రవితేజకు మెమోలు ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.