ఏరుదాటిన డీఎంహెచ్​ఓ

ఏరుదాటిన  డీఎంహెచ్​ఓ
  •    పెనుగోలు సందర్శనకు వెళ్లొచ్చిన హెల్త్​ ఆఫీసర్లు 

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు సందర్శనకు వెళ్లిన డీఎంహెచ్​ఓ అల్లం అప్పయ్య, వైద్య సిబ్బంది తిరిగి వచ్చేప్పుడు  పొంగిన ఏరును  దాటాల్సి వచ్చింది.  వైద్య పరీక్షల కోసం గ్రామ సందర్శనకు వెళ్లిన  సందర్భంగా డీఎంహెచ్​ఓ మాట్లాడారు.  పెనుగోలులో 10 కుటుంబాలు ఉన్నాయని, వాజేడు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ప్రతి నెలా  16 కిలోమీటర్లు ప్రయాణించి  ఈ గ్రామాన్ని సందర్శిస్తారని   తెలిపారు.  

ఈక్రమంలో  గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసేందుకు తానూ  వెళ్లినట్టు తెలిపారు. మంగళవారం రాత్రి అక్కడే ఉండి బుధవారం తిరుగు పయణమయ్యామని,  వచ్చేప్పుడు వాగు పొంగిదని, టీమ్​గా ఏర్పడి వాగు దాటామని తెలిపారు. ప్రతి నెలా వాజేడు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది

పెనుగోలు గ్రామానికి వెళ్లి వైద్యం చేస్తున్నారని అభినందించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.  గ్రామ ప్రజలను   మైదాన ప్రాంతానికి తరలించేలా  చర్యలు చేపట్టాలని  ములుగు జిల్లా కలెక్టర్ కు వివరిస్తానని అన్నారు.