కంటి పరీక్షలను పరిశీలించిన డీఎంహెచ్​వో

కంటి పరీక్షలను పరిశీలించిన డీఎంహెచ్​వో

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న విద్యార్థులకు కంటి పరీక్షల ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీఎంహెచ్​ఓ డాక్టర్​ కళావతిబాయి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఆర్​బీఎస్​కే టీమ్​ లో ఆప్తాలమిక్​ ఆఫీసర్లు రెండు విడతలుగా అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్క్రీనింగ్ చేసి దాదాపు 3,500 మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. ఆపరేషన్ అవసరం అనుకుంటే హైదరాబాద్ పంపి, వారికి తగిన చికిత్సలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్​ అధికారి డాక్టర్​ చందునాయక్​, డెమో సాంబశివరెడ్డి, కంటి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

అక్యూపంక్చర్ ఆస్పత్రి తనిఖీ 

ఖమ్మం టౌన్ :  ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ లో ఉన్న అక్యూపంక్చర్ ఆస్పత్రిని మంగళవారం డీఎంహెచ్​వో కళావతి బాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ కు రిజిస్ట్రేషన్ లేకుండా ఎలా ప్రాక్టీస్ చేస్తారని ఆమె స్టాఫ్ ను ప్రశ్నించారు. ఆ  సమయంలో డాక్టర్ పేర్కొన్న పి. విజయభాస్కర్ లేకవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అతడికి సంబంధించి ఎలాంటి అర్హత పత్రాలు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ  డీఎంహెచ్​వో సైదులు, పీవో(సీహెచ్ ఐ)డాక్టర్ చందునాయక్, డెమో సాంబశివరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
.