నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్​వో డాక్టర్ కోటాచలం

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్​వో డాక్టర్ కోటాచలం

హుజూర్ నగర్, వెలుగు : ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్​వో డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ప్రైవేట్​ఆస్పత్రులను ఆయన తనిఖీ చేశారు. ఇటీవల పట్టణంలోని లింగగిరి రోడ్ లో ఉన్న న్యూ కమల ఆస్పత్రిలో చివ్వేంల మండలం ఎంజీ తండాకు చెందిన 7 నెలల గర్భిణి సుహాసినికి అబార్షన్ చేయడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా  న్యూ కమల ఆస్పత్రిలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనుమతులు లేకుండా కమల డెంటల్ కేర్ పేరుతో నడుపుతున్న మరో ఆస్పత్రిని సీజ్ చేశారు. అనంతరం డీఎంహెచ్​వో మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసే వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ వో నిరంజన్, జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.