- డీఎంహెచ్వో గాయత్రి
జోగిపేట, వెలుగు: జోగిపేట ఏరియా ఆస్పత్రిని శుక్రవారం డీఎంహెచ్వో గాయత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులు పరిశీలించి 20 మంది కి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో ముగ్గురు డెంగ్యూ చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.
అనంతరం హాస్పిటల్లో అన్ని వార్డులు తిరిగి పేషెంట్ల రికార్డులు పరిశీలించారు. వారితో మాట్లాడి వైద్యం అందుతున్న తీరు తెలుసుకున్నారు.