మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు : డీఎంహెచ్​వో గోపాల్ రావు

మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు :  డీఎంహెచ్​వో గోపాల్ రావు

ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని డీఎంహెచ్​వో గోపాల్ రావు అన్నారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చి వివిధ కారణాలతో బాధపడుతూ వైద్య శిబిరం వద్దకు వచ్చిన 110మంది రోగులకు శుక్రవారం చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. 

మేడారంలో ఈగలు ప్రబలకుండా మాంసం షాపుల వద్ద శానిటేషన్​పనులు చేపడుతున్నారని, షాపుల నిర్వాహకులకు అవగాహన కల్పించామన్నారు. ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సందర్శించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ యమున, డీపీఎంవో సంజీవరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.