నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలోని రాఘవేంద్ర హాస్పిటల్, గాయత్రి హాస్పిటల్ ను డీఎంహెచ్వో స్వ రాజ్యలక్ష్మి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ నెల 25న తెలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన గర్భిణి రాములమ్మ చనిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. హాస్పిటల్కు వచ్చిన సమయం, ఆరోగ్య పరిస్థితి, చేసిన పరీక్షలు, మందుల వివరాలు, నమోదు చేసిన రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం హాస్పిటల్లో అందిస్తున్న సేవలు, చికిత్సలు, ఫీజులు, ల్యాబ్ పరీక్షలు, రోగుల రికార్డులు, వార్డులు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. రాములమ్మకు చికిత్స అందించిన హాస్పిటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.