మహబూబాబాద్, వెలుగు : సికిల్ సెల్ ఎనీమియా పట్ల హెల్త్ సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించాలని డీఎంహెచ్వో కళావతిభాయి కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదని, సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు.
సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అంబరీశ్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆరోగ్య బోధకులు మహేందర్ రెడ్డి, గీత, ఒరుక్మోద్దీన్, రాజకుమార్, ఉమాకర్ తదితరులు పాల్గొన్నారు.