కారేపల్లి/కామేపల్లి, వెలుగు : కారేపల్లి, కామేపల్లి మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్వో కళావతి బాయి బుధవారం తనిఖీ చేశారు. చిన్న పిల్లలకు ఇస్తున్న వ్యాక్సినేషన్ రిజిస్టర్లను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
మండల వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట డీఐవో చందు నాయక్ ఉన్నారు.