సెలెన్ బాటిల్ పగలడంతోనే ఫంగస్ 

  •     డీఎంహెచ్​వో కళావతి బాయి

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి పీహెచ్ సీని డీఎంహెచ్​ఓ కళావతి బాయి విజిట్ చేశారు. శనివారం వెలుగు దినపత్రికలో సెలెన్ బాటిల్లో ఫంగస్ వార్తకు స్పందించిన వైద్యాధికారులు పీహెచ్ సీలో ఎంక్వైరీ చేశారు. సెలెన్​లో ఆర్ఎల్ బాటిల్ ప్రభుత్వం ద్వారా సప్లై చేయలేదన్నారు.

ఆర్ఎల్ బాటిల్ పగలడంతోనే ఫంగస్ వచ్చిందన్నారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించి, స్టాఫ్ కు సూచనలు చేశారు. ఆమెవెంట డిప్యూటీ డీఎంహెచ్వో అంబరీష, డాక్టర్ చైతన్య, సీహెచ్​వో బాలాజీ ఉన్నారు.