- డీఎంహెచ్‌వో కె.ప్రమోద్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు స్థాయికి మించి, తప్పుడు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో కె.ప్రమోద్ కుమార్ హెచ్చరించారు. బుధవారం డీఎంహెచ్‌వో ఆఫీసులో జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ ఆర్‌ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడని, సూచిక బోర్డుపై ఫస్ట్ ఎయిడ్సెంటర్ అని రాయాలన్నారు. ఆఫీస్ సిబ్బంది రాజేశం, భూమేశ్వర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా.శ్రీనివాస్, డా.అర్చన, డా.జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
హుజూరాబాద్, వెలుగు : వైద్య సేవల కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కరీంనగర్ డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. హాస్పిటల్‌లోని చిల్డ్రన్ కేర్ యూనిట్
లేబర్ రూంలలో గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఆర్ఎంవో సుధాకర్ రావు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్, సిబ్బంది పాల్గొన్నారు.