ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే ఊరుకోం : డీఎంహెచ్​వో భాస్కర్​ నాయక్​

ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే ఊరుకోం : డీఎంహెచ్​వో భాస్కర్​ నాయక్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రయివేట్​హాస్పిటళ్ల​ యాజమాన్యాలు పేషెంట్ల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే ఊరుకోబోమని డీఎంహెచ్​వో ఎల్. భాస్కర్​ నాయక్​ హెచ్చరించారు. కొత్తగూడెం, చుంచుపల్లి ప్రాంతాల్లోని పలు ప్రయివేట్​ హాస్పిటళ్లు​, ల్యాబ్​లను ఆయన గురువారం తనిఖీ చేశారు. హాస్పిటళ్లలో పని చేసే డాక్టర్ల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా హాస్పిటళ్లు

ల్యాబ్​లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా ప్రయివేట్​ హాస్పిటళ్ల యాజమాన్యాలు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా హాస్పిటళ్లలో అన్ని  సౌకర్యాలుండాలన్నారు. ఆయన వెంట ప్రోగ్రామ్​ ఆఫీసర్​ డాక్టర్​ మధువన్, డిప్యూటీ డెమో ఫైజ్​మొహియుద్దీన్​ఉన్నారు.