ల్యాబ్​లు, స్కానింగ్​ సెంటర్లలో ఒకే రకంగా చార్జీలు ఉండాలి : డీఎంహెచ్​వో భాస్కర్​ నాయక్​

ల్యాబ్​లు, స్కానింగ్​ సెంటర్లలో ఒకే రకంగా చార్జీలు ఉండాలి : డీఎంహెచ్​వో భాస్కర్​ నాయక్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ల్యాబ్​లు, స్కానింగ్​ సెంటర్లలో జిల్లా వ్యాప్తంగా చార్జీలు ఒకే రకంగా ఉండాలని డీఎంహెచ్​వో ఎల్.భాస్కర్ ​నాయక్ సూచించారు. డీఎంహెచ్​వో ఆఫీస్​లో ల్యాబ్​లు, స్కానింగ్​ సెంటర్ల నిర్వాహకులు, ఐఎంఎ అసోసియేషన్​ ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నడుస్తున్న ప్రైవేట్​ డయాగ్నస్టిక్​ సెంటర్లలో బ్లడ్​ టెస్టులు, అల్ట్రా సౌండ్​ స్కాన్, ఎక్స్​రేలకు తీసుకుంటున్న ఫీజులపై నియంత్రణ అవసరమన్నారు.

 గతంలో కన్నా 20శాతం తగ్గించి తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్​ కృష్ణ ప్రసాద్, సెక్రటరీ డాక్టర్​ ముక్కంటేశ్వరరావు, ట్రెజరర్​ డాక్టర్​ ప్రవీణ్, గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీ అసిస్టెంట్​ప్రొఫెసర్​ డాక్టర్​ తిరుపతి, డాక్టర్​ రత్నకుమారి, ప్రయివేట్​ డయాగ్నస్టిక్​ అసోసియేషన్​ ప్రతినిధులు, డిప్యూటీ డెమో ఫయాజుద్దీన్​ పాల్గొన్నారు.