- జల్లేపల్లిని సందర్శించిన డీఎంహెచ్వో మాలతి
కూసుమంచి, వెలుగు : ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో మాలతి సూచించారు. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో ఇటీవల ఒక డెంగ్యూ కేసు నమోదు కావడం, చాలా మంది జ్వరాల బారిన పడడంతో శుక్రవారం ఆమె గ్రామాన్ని సందర్శించారు. పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నీళ్ల ట్యాంకులు, పైపు లైన్లు క్లీనింగ్గా ఉంచాలని అధికారులకు సూచించారు.
లీకేజీలు ఉన్నచోట వెంటనే రిపేర్లు చేయాలని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్చల్లాలని, మురుగు నీరు నిల్వకుండా చూడాలని చెప్పారు. ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి లక్ష్మీనారాయణ, డిప్యూటీ సీఈవో బి. నాగలక్ష్మి, ఎంపీడీవో శేషాద్రి, ఎస్సై బైరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎంపీవో రాజేశ్వరి, స్పెషల్ ఆఫీసర్ ఆయేషా, డాక్టర్ రామారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి
ఖమ్మం టౌన్ : జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లు వైద్య ఆరోగ్యశాఖ నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని డీఎంహెచ్వో బి.మాలతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ హాస్పిటల్ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు లోబడి పని చేయాలని సూచించారు. హాస్పిటల్లోలో ప్రైస్ లిస్ట్, స్టాఫ్, సేవల డీటెయిల్స్ డిస్ప్లే చేయాలని పేర్కొన్నారు. లింగనిర్ధారణ టెస్టులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.