ప్రతి ఇంటికి వెళ్లాలి.. టెస్టులు చేయాలి.. ఆశా, హెల్త్​ సిబ్బందికి డీఎంహెచ్ఓ ఆదేశం

ప్రతి ఇంటికి వెళ్లాలి.. టెస్టులు చేయాలి.. ఆశా, హెల్త్​ సిబ్బందికి డీఎంహెచ్ఓ ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి ఇల్లు తిరుగుతూ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా, హెల్త్​ సిబ్బందికి హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ జె. వెంకట్ ఆదేశించారు. సోమవారం పురానా పూల్, పానీపురా ప్రైమరీ హెల్త్​ సెంటర్లలోని సిబ్బంది, సూపర్ ​వైజర్లు, మెడికల్ ఆఫీసర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి, 30 ఏండ్లు పైబడిన వారందరికీ బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులపై స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలన్నారు. 

అనుమానితులను హెల్త్ సెంటర్లకు తరలించి, వ్యాధి నిర్ధారణ జరిగితే తగిన చికిత్స అందించాలని సూచించారు. సమావేశంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శశికళ, పానీపురా క్లస్టర్ పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.