నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలు మెరుగుపడాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో రాజశ్రీ హెచ్చరించారు. బుధవారం ఖానాపూర్, నాగారం దవాఖానలు విజిట్ చేశారు. ప్రతి రోజు సమయపాలన పాటించాలని, ముందస్తు పర్మిషన్ లేకుండా ఎవరూ లీవ్ తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు.
సీతారాంనగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి నాగారం బస్తీ దవఖానకు మెడిసిన్స్ తెచ్చుకోవాలని, ఖానాపూర్ దవాఖానకు ముదక్పల్లి పీహెచ్సీ నుంచి మందులు సమకూర్చుకోవాలన్నారు. కాలనీలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి ట్రీట్మెంట్కు తరలించాలని ఆదేశించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.