గుడిహత్నూర్,వెలుగు : వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం గా ఉండొద్దని డీఎంహెచ్‌ఓ రాథోడ్ నరేందర్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీలో జరుగుతున్న ప్రసవాల గురించి మెడికల్‌ఆఫీసర్‌శ్యాంసుందర్‌ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆశ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్యాన్ని పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని , ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ శివాజీ, సూపర్వైజర్లు రవీందర్, అన్నపూర్ణ,వైద్య సిబ్బంది ఉన్నారు.