విధుల్లో లేని ఆఫీసర్లు.. జీతం కట్ చేస్తూ మెమో జారీ

విధుల్లో లేని ఆఫీసర్లు.. జీతం కట్ చేస్తూ మెమో జారీ

పాపన్నపేట, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ డీఎంహెచ్​వో శ్రీరామ్ హెచ్చరించారు. పాపన్నపేట పీహెచ్​ సీనని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్లు సారికా, ప్రదీప్ రావు ఇద్దరూ విధుల్లో లేకపోవడంతో ఒకరోజు జీతం నిలుపుదల చేస్తూ మెమో జారీ చేశారు. 

డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్న  నేపథ్యంలో మెడికల్ ఆఫీసర్లు ఇద్దరూ గైర్హాజరు కావడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ రిపీట్ అయితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం రికార్డులు, మందులను తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు.