అంతా కాపీ పేస్ట్: హీరో విజయ్‎కి డీఎంకే దిమ్మతిరిగే కౌంటర్

అంతా కాపీ పేస్ట్: హీరో విజయ్‎కి డీఎంకే దిమ్మతిరిగే కౌంటర్

చెన్నై: తమిళగ వెట్రి కజగం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్‎.. 2024, అక్టోబర్ 27న విల్లుపురంలో భారీ బహిరంగా సభ నిర్వహించారు. దాదాపు 8 లక్షల మంది హాజరైన ఈ సభలో తన పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలను విజయ్ ప్రజలకు వివరించాడు. ఈ క్రమంలోనే విజయ్ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డాడు. మరీ ముఖ్యంగా డీఎంకేపై విమర్శలు గుప్పించాడు.

ద్రవిడియన్ మోడల్ పేరుతో డీఎంకే ప్రజలను మోసం చేస్తోందని.. అండర్ హ్యాండ్ డీలింగ్ ద్వారా ఒక ఫ్యామిలీ రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని పరోక్షంగా సీఎం స్టాలిన్ కుటుంబంపై ధ్వజమెత్తాడు. ఈ క్రమంలో విజయ్ వ్యాఖ్యలకు డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం అంతా కాపీ పేస్ట్ అని కొట్టి పారేసింది. డీఎంకే సీనియర్ నాయకుడు టీకేఎస్ ఇలంగోవన్ మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ చెప్పినవన్నీ మా విధానాలు, అతడు కాపీ కొట్టాడని అన్నారు. విజయ్ చెప్పినవి అన్నీ ఇప్పటికే మేం ఆచరిస్తున్నామన్నారు. 

ALSO READ : DMK vs TVK: అవి నిరాధారమైన ఆరోపణలు..టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే రియాక్షన్

డీఎంకే తన 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విజయ్ లాంటి చాలా మంది ప్రత్యర్థులను చూసిందన్నారు. ఇలాంటి పార్టీలను మేం చాలా చూశామని.. అతడికి ఇదే తొలి సమావేశం ఇక నుండి చూద్దామని అన్నారు. ప్రజల సమస్యల కోసం పోరాడటానికి డీఎంకే పార్టీని స్థాపించారని తెలిపారు. పార్టీ ప్రారంభించిన రెండేళ్లలోనే విజయ్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు. డీఎంకే పార్టీ కార్యకర్తల ప్రజలు కోసం కొట్లాడి టీవీకే నాయకులు జైలుకు వెళ్లరని.. ఇతర పార్టీలకు డీఎంకే మధ్య ఉన్న తేడా ఇదేనని పేర్కొన్నారు.