రాజ్యసభకు కమలహాసన్ : డీఎంకే పార్టీ నుంచి ఎంపీగా..

రాజ్యసభకు కమలహాసన్ : డీఎంకే పార్టీ నుంచి ఎంపీగా..

తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎంత షాకింగ్ గా ఉంటాయో మరోసారి నిరూపించాయి. ప్రముఖ నటుడు, హీరో కమలహాసన్ ను రాజ్యసభకు ఎంపిక చేసింది డీఎంకే పార్టీ. ఈ మేరకు 2025, ఫిబ్రవరి 12వ తేదీన చర్చలు విజయవంతంగా పూర్తి చేసింది డీఎంకే పార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నుంచి స్టాలిన్ సీఎంగా ఉన్నారు. ఆయన సూచన మేరకు కమలహాసన్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది ఆ పార్టీ. 

మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కమలహాసన్.. ఎన్నికల్లో మాత్రం చిత్తు చిత్తు ఓడిపోయారు. ఒక్క సీటుగా కూడా గెలవలేదు. ఆ తర్వాత డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కమలహాసన్ ను రాజ్యసభకు ఎంపీగా పంపించాలని డిసైడ్ అయ్యింది డీఎంకే పార్టీ. 

Also Raed : జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా

2025, జూలై నెలలో తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. డీఎంకే పార్టీకి నాలుగు సీట్లు గ్యారంటీగా వస్తాయి. అందులో ఒక సీటును కమలహాసన్ ఇవ్వాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ సైతం కమలహాసన్ కు మంచి ఆఫర్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే.. కాంగ్రెస్ పొత్తులో భాగంగా లోక్ సభ ఎంపీ సీటు ఇస్తామని ఆఫర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించారు కమలహాసన్. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చారు కమలహాసన్. ఈ క్రమంలోనే రాజ్యసభకు పంపించాలని నిర్ణయించి చర్చలు జరిగింది డీఎంకే పార్టీ. ఇందుకు కమలహాసన్ కూడా ఓకే చెప్పారు.

2025, జూలై నెలలో కమలహాసన్ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.